
ఎంఆర్వో క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం…
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రమాదం..
Web desc : చేవెళ్లలోని వినియోగంలో లేని పాత ఎంఆర్వో క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో నిల్వ ఉంచిన పాత కార్యాలయ కాగితాలకు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.
పాత కాగితాలు మాత్రమే పాక్షికంగా కాలిపోయాయని, ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులకు ఎలాంటి నష్టం జరగలేదని రికార్డు అసిస్టెంట్ నగేష్ తెలిపారు. కందుకూరు పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భవనానికి కూడా పెద్దగా నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});