
డీసీసీబీ చింతకాని బ్రాంచ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ మంజూరు
అతి తక్కువ వడ్డీ రేటుతో వాహన రుణాలు – బ్రాంచ్ మేనేజర్
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం పరిధిలోని చింతకాని బ్రాంచ్ ద్వారా అమలు చేస్తున్న వాహన రుణ పథకం కింద సీతంపేట గ్రామానికి చెందిన కొమ్ము గోపయ్య కి టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మంజూరు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సీహెచ్. రీటా గారు మాట్లాడుతూ, బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీ రేటుతో వాహన రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
బ్యాంకు అందిస్తున్న వాహన రుణ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో చింతకాని బ్రాంచ్‌ను సంప్రదించి రుణ సదుపాయాన్ని పొందాలని సూచించారు.
ప్రజలకు ఆర్థిక సేవలు అందించడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా రుణ సదుపాయాలు కల్పించడమే బ్యాంకు ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సీహెచ్. రీటా, అసిస్టెంట్ మేనేజర్ వంకాయలపాటి దీపిక, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జె. నాగార్జున మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.