
మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో వైరల్
Web desc : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సొంత ఇలాఖాలో చేదు అనుభవం ఎదురైంది.
ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు చేసేందుకు భట్టి విక్రమార్క వెళ్లారు.
అయితే కొందరు మహిళలు అర్హులైన మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు అంటూ భట్టి విక్రమార్కను నిలదీశారు. గ్రామంలో 15 ఎకరాల భూమి, రెండంతస్తుల బిల్డింగులు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు.. కానీ అర్హులైన తమకు ఇవ్వడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
డౌన్ డౌన్ భట్టి అంటూ మహిళలు, బాధితులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది. రేవంత్ సర్కార్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ఎంత పారదర్శకంగా జరుగుతుందో తాజా వీడియో మరోసారి చెప్పకనే చెబుతోంది.