
సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
Web desc : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామ శివారులోని శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లో కి వెళ్తే.. పెన్పహాడ్ మండలంలోని అన్నారం బ్రిడ్జి గ్రామానికి చెందిన మీసాల చిన్న పిచ్చయ్య, మీసాల లోకేశ్వరి దంపతులు. లోకేశ్వరి సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వరిస్తున్నది. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం లోకేశ్.. తన భర్తతో కలిసి బైక్పై స్వగ్రామానికి బయల్దేరింది. ఇదే సమయంలో సూర్యాపేటకు చెందిన చింత లోకేశ్ అనంతారంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై బైకుపై తిరిగి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో శ్రీ మణికంఠ రైస్ మిల్లు సమీపంలో వీరి బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న పిచ్చయ్య, లోకేశ్వరి, చింత లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.