
అంగన్ వాడి ఆయాల పోస్టులు ఎప్పుడు..!
అంగన్ వాడిలో ఆయాలు లేక, చిన్నారులకు తిప్పలు..
అంగన్వాడీ టీచర్లకు బిఎల్ఓ బాధ్యతలు..
మూతపడుతున్న కేంద్రాలు ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్న పిల్లలు..
అంగన్వాడి టీచర్ల తిప్పలు పట్టించుకోని ప్రభుత్వం…
పిల్లలను అంగనివాడు కేంద్రాల్లో చేర్పించుకోకుంటే టీచర్లకు నోటీసులు అంటూ ప్రభుత్వం నుంచి ఒత్తిడి
ఆయాల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి,
(సీ కే న్యూస్) చేగుంట
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాలలో ఆయాలు లేక అంగన్వాడీ కేంద్రాల దుస్థితికి మరో కారణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ టీచర్లకు అప్పటికే మీటింగులతో పని భారం, సెక్టార్ మీటింగ్ లు, ప్రాజెక్టు మీటింగు లు, ఉండగా, ఇప్పుడు మరో బిఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) బాధ్యతలను,కూడా అప్పగించడంతో పరిస్థితి మరింత దిగజారింది.
ఆయాలు లేరు, చాలా కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు అదనపు పనులు, టీచర్లకు రోజూ మీటింగులు, ఇప్పుడు బిఎల్ఓ డ్యూటీలో భాగంగా ఓటర్ లిస్టు సవరణ, ఇంటింటి సర్వే పనులు అప్పగించారు.
ఫలితం టీచర్ బయటి డ్యూటీకి వెళ్తే కేంద్రానికి తాళం పడుతుంది,
దీంతో పిల్లల స్ట్రెంత్ (హాజరు) గణనీయంగా తగ్గిపోతోంది. తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని భావించిన తండ్రులు, ప్రభుత్వ అంగన్వాడీలను వదిలి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వానికి,ప్రజల సూటి ప్రశ్న,
పసి పిల్లలకు అక్షరాలు, పోషణ అందించాల్సిన టీచర్లతో ఎన్నికల డ్యూటీలు, బిఎల్ఓ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం? ఖాళీ ఆయా పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న టీచర్లపై ఇంత భారం మోపితే పేద పిల్లల చదువు ఏం కావాలి?
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులు స్పందించి, అంగన్వాడీ టీచర్లను కేవలం పిల్లల సంరక్షణకే పరిమితం చేసి,
బిఎల్ఓ బాధ్యతల నుండి తప్పించాలని, వెంటనే ఆయాలను నియమించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.