
విడాకులు కోరిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం
Web desc : హైదరాబాద్ నగరంలోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో దారుణం జరిగింది. విడాకుల వివాదానికి సంబంధించి నడిరోడ్డుపై ఓ వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసరా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతికి, కృష్ణ ప్రసాద్ శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
అయితే వివాహం తర్వాత తనకు లైంగిక అసమర్థత (సెక్సువల్ ఇన్కెపాసిటీ) ఉన్నట్లు భర్త శ్రీనివాస్ స్వయంగా తెలపడంతో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం పని ముగించుకుని యువతి ఇంటికి తిరిగి వస్తుండగా.. భర్త శ్రీనివాస్ ఆమెను గమనించి రహదారిపై వెంబడించాడు.
జీడిమెట్ల ప్రాంతంలో ఆమెను బలవంతంగా అడ్డుకుని నడిరోడ్డుపైనే తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తేరుకుని వెంటనే పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.