
బాలికపై సహ విద్యార్థి లైంగిక దాడి.. గర్భం దాల్చిన 8వ తరగతి స్టూడెంట్
Web desc ఎనిమిదో తరగతి చదువుతున్న15 ఏండ్ల సహ విద్యార్థి లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్పరిధిలోని ఒక స్కూల్లో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.
తన స్నేహితుడి అక్క ఆహ్వానం మేరకు సెప్టెంబర్‌లో వారి ఇంటికి వెళ్లగా సహ విద్యార్థి లైంగిక దాడి చేశాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించండంతో మౌనంగా ఉండిపోయింది.
రెండు నెలలుగా నెలసరి రాకపోవడం, ఇష్టమైన ఆహారం తినాలనే కోరికలు పెరగడం, ఆరోగ్య పరిస్థితిలో మార్పులు కనిపించడంతో కుటుంబసభ్యులకు ప్రెగ్నెన్సీ టెస్ట్చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితురాలి తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});