
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్
Web desc : హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్కు చెందిన సబ్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.గాంధీనగర్ సెక్షన్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న జి. సంతోష్ ఆనంద్‌ను రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ చోరీకి సంబంధించిన ఆరోపణలపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సంతోష్ ఆనంద్ ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. తొలుత రూ.50 వేలు ఇవ్వాలని కోరిన అధికారి..
అనంతరం రూ.35 వేలకు తగ్గించి, చివరకు రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. లంచం సొమ్మును లెక్కించి తన ప్యాంటు ఎడమ జేబులో పెట్టుకున్న సమయంలో అధికారులు అతడిని పట్టుకున్నారు.
నిందితుడి జేబు నుంచి రూ.30 వేల లంచపు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంతోష్ ఆనంద్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.