
ఎంఐఎం నేత దారుణ హ*త్య.. కత్తులతో దాడి చేసి హతమార్చిన దుండగులు!
ఎంఐఎం నేత మూర్తుజ అలీ దారుణ హత్యకు గురయ్యాడు. ముర్తుజ పహిల్వాన్ ను గుర్తుతెలియని దుండగులు శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఎకో పార్కు సమీపంలో కత్తులతో దాడి చేశారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.
తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను వెంటనే అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజేంద్రనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముర్తుజ పైల్వాన్ ఎంఐఎం నాయకుడిగా గుర్తింపు పొందారు.
దుండగులు ఆయనపై ఎందుకు దాడి చేశారు.. ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});