
మియాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రక్షించిన పోలీసులు!
Web desc : బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగం, వివాహం ఆశ చూపించి వ్యభిచార కూపంలోకి నెట్టిన ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇన్స్పెక్టర్ జయరాం కథను ప్రకారం.. మియాపూర్‌లోని ఆదిత్యనగర్, న్యూ హఫీజ్‌పేట్‌లో ఓ అపార్ట్మెంట్ పై దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు ఇద్దరు మహిళలను రక్షించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాన నిందితుడు పిల్లలమర్రి సంతోష్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో మల్కాజ్‌గిరిలో ఈ తరహా వ్యభిచారం నిర్వహించి పట్టుబడ్డాడు.పోలీసుల నిఘా పెరగడంతో మకాం మియాపూర్‌కు మార్చి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరో నిందితుడు ఎండీ హసన్ సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళలను ఉద్యోగం, వివాహం పేరుతో ఆకర్షించి వ్యభిచారంలోకి నెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెలుగు చూశాయి. దాడిలో ఐదు కండోమ్‌లు, రెండు స్మార్ట్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.