BhadrachalamPoliticalTelangana

నా భర్తను బతికించండి….

నా భర్తను బతికించండి….

నా భర్తను బతికించండి….

రోజు రోజుకూ మృత్యు ఒడికి చేరుతున్న వైనం…

ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయాన్ని అందించండి….

అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్న నందిపాడు వాసి.

అరు నెలలుగా కొనసాగుతున్న చికిత్స.

దాతలు సాయం కోరుతున్న భార్య సమ్మక్క.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / అశ్వారావుపేట ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జూన్ 20,

కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న తన భర్తకు చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వేడుకుంటుంది. తన భర్తను కాపాడుకునేందుకు సాయం చేయాలంటూ ఆ రోగి భార్య సవలం సమ్మక్క కన్నీటి పర్యంతమవుతున్నారు.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అశ్వారావుపేట మండలం, నందిపాడు గ్రామానికి చెందిన సవలం కాంతారావు (40) వ్యవసాయ కూలి అరు నెలల క్రితం క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం, హైదరాబాద్ లోని హాస్పిటల్లో అరు నెలలుగా చికిత్స చేయిస్తున్నారు.

ఇప్పటికే ఉన్న పొలం భూమిని అమ్మేసి చికిత్స కోసం అప్పులు చేసి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా నయం కాలేదు.. ఈ నేపథ్యం లో ప్రభుత్వం, దాతలు ఆర్థిక సాయం చేస్తే తన భర్తను కాపాడుకుంటామని చేతులు జోడించి
అభ్యర్థిస్తున్నారు.

సాయం చేయదలచిన దాతలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతా నంబరు.. 35204450325 సవలం సమ్మక్క ,ఐఎఫ్ఎస్సీ కోడ్
ఎస్ బి ఐ ఎన్ 00 13326 లో 8500917079 (సవలం సౌజన్య నెంబరుకు ఫోన్పే ద్వారా జమ చేయాలని భార్య దయ హృదయము గల వారిని సామాజిక సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రజా ప్రతినిధులను రాజకీయ నాయకులను దాతలను దీన హృదయంతో అభ్యర్థిస్తోంది. దినపత్రికలో ప్రచురిస్తున్న ఈ న్యూస్ ను చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయని వారికి అందిస్తారని అభ్యర్థించడం జరుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!