Mahabub badPolitical

తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం

తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం

బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ నిధులు విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారికి వినతిపత్రం అందజేత

తక్షణమే పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం కింద పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్, పట్ల మధు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, కెవిపిఎస్ తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారికి అందజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులు పెండింగ్లో ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ..చాలా ప్రైవేట్ పాఠశాలల్లో నిధులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెండింగ్ నిధులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల రాబోయే రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బానోత్ వెంకన్న ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బస్సు కెవిపిఎస్ జిల్లా నాయకులు పందుల మహేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుండ్ల రాకేష్ దిలీప్ మహేష్ వినయ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button