JagityalaPoliticalTelangana

మంత్రి కి తప్పిన ప్రమాదం…రన్నింగ్‌లో ఊడిపోయిన కారు టైరు..

మంత్రి కి తప్పిన ప్రమాదం…రన్నింగ్‌లో ఊడిపోయిన కారు టైరు..

మంత్రి కి తప్పిన ప్రమాదం…రన్నింగ్‌లో ఊడిపోయిన కారు టైరు..

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కోరుట్ల, మెట్పల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

మెట్‌పల్లి నుండి తన కాన్వాయ్‌తో వస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరపేట వద్దకి రాగానే వేరే కారు వచ్చి కాన్వాయ్‌లోని కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూజర్ కారు ముందు టైరు ఊడిపోయింది.

అయితే మంత్రి అడ్లూరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వేరే కారులో మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా గత సంవత్సరం విప్ హోదాలో ఒకసారి కారు ప్రమాదం జరుగగా అడ్లూరి స్వల్ప గాయాలతో బయట పడగా మంత్రి అయ్యాక ఇది రెండో ప్రమాదం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button