HyderabadPoliticalTelangana

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌

ప్రముఖ తెలుగు న్యూస్‌ ఛానల్‌లో పనిచేస్తున్న యాంకర్‌ స్వేచ్ఛ వోటార్కర్‌(40) శుక్రవారం బలవర్మణానికి పాల్పడ్డారు.

చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజు నాయక్‌ వివరాల ప్రకారం… కుటుంబ కలహాలతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురికీ తరలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యాంకర్ స్వేచ్ఛ మరణానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.

స్వేచ్ఛ పలు న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా పని చేసింది. మీడియా రంగంలో ఎంతో యాక్టివ్ గా ఉంది. ఈ విషయం తెలిసి స్వేచ్ఛ స్నేహితులు షాక్ కి గురయ్యారు. శోక సంద్రంలో మునిగిపోయారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో స్వేచ్ఛ తన కూతురితో నివాసం ఉంటుంది. ఇటీవలే అరుణాచలంలోని దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చింది.

శుక్రవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. వెంటనే స్పాట్ కి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు.మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికీ తరలించారు.

ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఆరా తీస్తున్నారు. పూర్ణచంద్ర అనే స్నేహితుడు తనతో సన్నిహితంగా ఉంటున్నాడని యాంకర్ స్వేచ్ఛ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేసింది. లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్లు అనేకసార్లు ఆమె ప్రకటించింది. నిన్న ఒక్కసారిగా కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈరోజు డ్యూటీకి వెళ్లి వచ్చాక స్వేచ్ఛ బలవన్మరణం చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్వేచ్ఛ ఇక లేదు అనే వార్తను తోటి యాంకర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button