
“తరతరాలుగా వస్తున్న బంజారా అందమైన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం అందరి బాధ్యత
డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్,
(లంబాడి/ బంజారా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు.)
ఈరోజు మహబూబ్ బాద్ జిల్లా, ఇల్లందు నియోజకవర్గ పరిధిలోనీ బయ్యారం మండల అధ్యక్షులు జర్పుల శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “లంబాడీల ఐక్యవేదిక~LIVE” తీజ్ నిర్వహణ కమిటీ కార్యక్రమానికి హాజరైన “లంబాడీల (బంజారా) ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు” డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్.
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది ‘తీజ్ పండుగ’ “తీజ్” అనగా గోదుమ మొలకలు అని అర్థం.
ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణమాసములో శుక్ల పక్షంలో కఠోర దీక్షాతో, భక్తి శ్రద్ధలు, నియమనిబద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
బంజారా లంబాడ ప్రజలు ప్రతీ ఏటా పచ్చదనాన్ని, పునర్జీవనాన్ని కోరుతూ “ప్రకృతిని ఆరాధిస్తూ”, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంట, పైరు, ప్రజలందరు సుఖశాంతులతో, జీవకోటిరాసి చల్లగా ఉండాలని, ప్రపంచం పచ్చగా కళకళలాడుతూ ఎప్పుడూ హరిత భరితంగా ఉండాలని, పెళ్ళి కాని అమ్మాయిలకు మంచి గుణవంతుడైన భర్త రావాలని జరుపుకునే పండుగనే తీజ్ పండుగ.
బంజారా (లంబాడ) ప్రజల ఎంతో గొప్ప వైవిధ్యమైన, అందమైన సంస్కృతి సాంప్రదాయాలను సమాజానికి చాటిచెప్పాలంటే బంజారా బిడ్డలు అందరం ఒకే సారి, ఏక కాలంలో తీజ్ పంగులను న్నిర్వహించి బంజారా జాతి ఓనత్యాన్ని, గొప్పతనాన్ని, ఐక్యతను చాటిచెప్పాలని లంబాడిలా బంజారా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ అన్నారు.
తేదీలు:
శ్రావణ మాసం శుక్ల పక్షం (చాందని రాత్) ఆగస్టు 1న శుక్రవారం రోజున ఘంపు గాలెరో (గోధుమలు నాన బెట్టుట).
ఆగస్టు 2న శనివారం ..తీజ్ బోయేరో…
ఆగస్టు 3న ఆదివారం.. బొరేడి తీజ్.
ఆగస్టు 8న శుక్రవారం.. ఢమోలి తీజ్.
ఆగస్టు 9న రెండవ శనివారం.. గణ్ గోర్ తీజ్.
ఆగస్టు 10న ఆదివారం..తీజ్ వెరాయేరో (కడావో తీజ్ / తీజ్ నిమజ్జనం)
కావున ఆగస్టు ఒకటవ తారీఖు నుండి 10 తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి తీజ్ నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపి జాతి ఐక్యతను చాటుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ బాధ్యులు వంకుడోత్ మంగీలాల్ నాయక్ అజ్మీరా దేవోజీ నాయక్ రాసామళ్ళ నాగేశ్వరావు గారు బానోత్ ఛత్రియ నాయక్ అజ్మీరా వీరన్న నాయక్ భూక్యా నాగ నాయక్ భూక్యా కిషన్ నాయక్, ఐక్య వేదిక విద్యార్తి విభాగం గోపాల్, గణేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.