
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇంజక్షన్ వికటించి నర్సింహ్మ రెడ్డి (62) అనే వ్యక్తి మృతి చెందాడు. మూత్ర నాళాల్లో సమస్య కారణంగా పరిగి మండలం జాఫర్ పల్లి గ్రామానికి చెందిన నర్సింహ్మ రెడ్డి సోమవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుశ్రుత ఆసుపత్రిలో చేరాడు.
శస్ర్త చికిత్స అనంతరం బుధవారం ఉదయం వైద్యులు ఇంజక్షన్ ఇవ్వడంతో నర్సింహ్మ రెడ్డి అప్పటికప్పుడే మృతి చెందినట్లు మృతిడి బంధువులు చెబుతున్నారు. రోగికి ఇంజక్షన్ ఇచ్చినప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని రోగి బంధువులు అంటున్నారు.
ఇంజక్షన్ ఇచ్చిన సమయంలో ఐసీయూలో డాక్టర్లు ఎవ్వరు లేరు అని సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే అంతా బయటకు వస్తుందనే కారణంగానే ఆసుపత్రిలో మెుత్తం సీసి కేమెరాలు పని చేయడం లేదని చెబుతున్నారని రోగి బంధువులు ఆస్పత్రిలో మృతదేహం ఉంచి నిరసనకు దిగారు.
నెల రోజుల నుంచి ఆసుపత్రిలో సీసీ కెమెరా పనిచేయక పోవడం ఏంటి అని రోగి బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మృతుడి బంధువులను ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)బెదిరింపు.
సుశ్రుత ఆసుపత్రిలో నర్సింహ్మ రెడ్డి మృతి చెందగానే వారి గ్రామం నుంచి అక్కడికి బంధువులు రాక ముందే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు అక్కడ ప్రత్యక్షం అయ్యారు.
ఆసుపత్రి యాజమాన్యంని మృతుడి బంధువులు మృతికి గల కారణాలను అడిగే ప్రయత్నం చేయగా ఐఎంఏ నాయకులు మధ్యలో కలుగజేసుకుని ఎక్కువ మాట్లాడితే మీ మీదనే కేసులు నమోదు చేయిస్తాం అని, గతంలో ఇలాంటి వ్యవహారంలో రోగి బంధువుల పై చాల కేసులు చేయించాం అని తమ పై బెదిరింపులకు దిగారని భాధితులు ఆరోపిస్తున్నారు.
ఉదయం వరకు తమ అందరితో మాట్లాడిన వ్యక్తి అప్పటికప్పుడు మృతి చెందడం పై డాక్టర్లను ప్రశ్నిస్తే ఇవి ఎక్కడి బెదిరింపులు అని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.