
చాచా నెహ్రూ ఆశయాలను నెరవేర్చండి
పలమనేరు నవంబర్ 14 CK news
నవంబర్ 14 బాలల దినోత్సవం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు.
ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని పలమనేర్ పట్టణంలో గుడియాత్తం రోడ్ లో గల ఎస్సీ బాలుర వసతి గృహమునందు, పలమనేరు సామాజిక సేవా కార్యకర్త పగడాల మధుమోహన్రావు బాలల దినోత్సవం ను పురస్కరించుకుని బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు అమితమైన ఇష్టమని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ హాస్టల్లో ఈ చిన్న సేవా కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆశయాలను అందరూ అందిపుచ్చుకోవాలని పిల్లలు బాగా చదివి మంచి వృద్ధిలోకి రావాలని నెహ్రు కలల కన్నా సమాజాన్ని నిర్మించే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో హాస్టల్ పిల్లలు, హాస్టల్ వార్డెన్ మధుసూదన్ రెడ్డి సామాజిక సేవ కార్యకర్త పాల్గొన్నారు



