
సింగర్ మంగ్లీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు
సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన పాటను కించపరుస్తూ, ఎస్టీ వర్గాన్ని కించపరిచేలా ఒక వ్యక్తి నీచంగా మాట్లాడారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఒక వ్యక్తి మాత్రం ఆ పాటను ఆధారంగా తీసుకుని మంగ్లీపై అవమానకరంగా, కులదూషణకు దారితీసేలా కామెంట్లు చేస్తూ వీడియో విడుదల చేశాడు.
దీనిపై ఆగ్రహించిన మంగ్లీ నేరుగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, షెడ్యూల్డ్ తెగలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలపై అతనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన మంగ్లీ.. నా పాటలు ప్రజలను అలరిస్తే అది నాకు ఎంతో ఆనందం. కానీ ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు వింటే తీవ్రంగా బాధిస్తుంది.
ఒక మహిళగా, ఇంకా ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఇలాంటి దూషణలు నేను అస్సలు సహించలేను చట్టంపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది” అని తెలిపారు.
సోషల్ మీడియాలో ఎవరి గౌరవాన్ని దెబ్బతీసేలా కామెంట్స్ చేసినా, ముఖ్యంగా మహిళలు మరియు గిరిజన వర్గాలను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే పాట ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ రికార్డులు చెరిపేస్తుంది. ఇప్పటికే పాటకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది వచ్చాయి.
అయితే ఈ పాట ఎంత వైరల్ అయ్యిందో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కొందరు ఈ సాంగ్ లో వాడిన పదాలను కించ పరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగ్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.



