KarimnagarPoliticalTelangana

ట్రాక్టర్ బోల్తా పడి కూలీ మృతి...

ట్రాక్టర్ బోల్తా పడి కూలీ మృతి...

ట్రాక్టర్ బోల్తా పడి కూలీ మృతి…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో గురువారం ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్ కు చెందిన కూలీ మృతి చెందాడు.ఎస్ ఐ శ్రీకాంత్ గౌడ్ కథనం మేరకు.. మానకొండూరు మండలం, గట్టు దుద్దెనపల్లి గ్రామం నుంచి తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి బయలుదేరిన ట్రాక్టర్ గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రం మధ్యపురకు చెందిన కూలీ చోటు రాయ్(28)ట్రాక్టర్ పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button