30 వ తేదీ పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) నవంబర్ 29
అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కార్మిక శాఖ ద్వారా జారీ కాబడిన జీ.ఓ.ఆర్.టీ. నెం.594, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో గల అన్ని కర్మాగారములు, దుకాణములు,
వాణిజ్య సంస్థలలో పనిచేయు కార్మికులకు తేదీ 30.11.2023 (గురువారం) నాడు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని నల్గొండ ఉపకార్మిక కమీషనర్ ఎం.రాజేంద్రప్రసాద్ తెలిపారు..అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.