PoliticalsuryapetaTelangana

అర్ధరాత్రి గేటు దాటి అబ్బాయిలతో వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు

అర్ధరాత్రి గేటు దాటి అబ్బాయిలతో వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు

అర్ధరాత్రి గేటు దాటి అబ్బాయిలతో వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు

సూర్యాపేట జిల్లా మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో తీవ్ర భద్రత లోపం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు విద్యార్థినులు గురుకుల పాఠశాల గేటు దాటి బయటకు వెళ్లిన ఘటన రెండు రోజుల క్రితం చోటుచేసుకోగా, ఆలస్యంగా విషయం బయటపడింది.

సీసీ కెమెరా ఫుటేజీ ప్రకారం.. అర్ధరాత్రి అబ్బాయిలతో కలిసి బైక్‌లపై వెళ్లిన విద్యార్థినులు తెల్లవారుజామున తిరిగి గురుకులానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ సంఘటన గురుకుల పాఠశాలలో సిబ్బంది పర్యవేక్షణ ఎంత మేరకు ఉందన్న ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యార్థుల భద్రతపై కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురుకులాల వంటి నివాస పాఠశాలల్లో భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button