
రోడ్ ఆక్సిడెంట్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి…
హైదరాబాద్ : మోటార్ బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఎన్ఎఫ్సీ బ్రిడ్జి సమీపంలో హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి పై చెత్త సేకరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి (50)ని యూనికాన్ బైక్ ఢీ కొట్టడంతో తలకు ఇతర శరీర భాగాలకు గాయాలు అయ్యాయి.
గాయాలపాలైన వ్యక్తిని 108 వాహనంలో గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు.
మృతుడు ఆరెంజ్ రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఇతని గురించి వివరాలు తెలిస్తే వెంటనే ఘట్కేసర్ పోలీసులకు సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు.



