
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు…!
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పీఎస్‌కు తరలించారు పోలీసులు.
దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చైర్మన్ ఎన్నిక తీరును ఎర్రబెల్లి తప్పుబటట్టారు ‘ కష్టపడి పనిచేసిన కార్యకర్తలక నేనేం సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పని చేస్తుంది. .
నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం వ్యవహరించింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్‌ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది.
బీజేపీకి కానీ, ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేద. దాంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి.
బీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీఠం చేజారిపోవడంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు భావోద్వాగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ప్రధానంగా తొర్రూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు.
ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బేటాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు. ఈ క్రమంలో లాఠీచార్జి వంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.



