HyderabadPoliticalTelangana

ఈ నెల 23న కేబినెట్ భేటీ.. వాటిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్

ఈ నెల 23న కేబినెట్ భేటీ.. వాటిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్

ఈ నెల 23న కేబినెట్ భేటీ.. వాటిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.

సుమారు 10 నుండి 15 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు.

వీటితో పాటు.. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రంలో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు మరింత వాస్తవిక దృక్పథంతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.

కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button