KarimnagarPoliticalTelangana

కెనాల్‌లో దూకి వివాహిత ఆత్మహత్య !

కెనాల్‌లో దూకి వివాహిత ఆత్మహత్య !

కెనాల్‌లో దూకి వివాహిత ఆత్మహత్య !

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలవేణి అనుష (వివాహిత) కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

స్థానికులు, సీఐ తెలిపిన వివరాల ప్రకారం దేవంపల్లి గ్రామానికి చెందిన పోలవేణి అనుషకు, లలితాపూర్ గ్రామానికి చెందిన పోలవేణి రాజుతో జూలై 2025లో వివాహం జరిగగా వారు కలిసి నివసిస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం సమయంలో అనూష తన పుట్టినిల్లు దేవంపల్లికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్ళిపోయింది. తన మొబైల్ ఫోన్‌ను కూడా ఇంట్లోనే వదిలి వెళ్ళింది.

ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, సమీపంలోని కెనాల్ వద్ద ఆమె పాదరక్షలు (చెప్పులు) కనిపించాయి. గాలింపు చర్యల అనంతరం, గురువారం రోజు రంగపేట శివారులోని కాకతీయ కెనాల్‌లో అనుష మృతదేహం లభ్యమైంది.

సీఐ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన పై ఇంకా పూర్తిస్థాయి ఫిర్యాదు అందాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button