HyderabadPoliticalTelangana

ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారాలా.. జగ్గారెడ్డి ఫైర్

ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారాలా.. జగ్గారెడ్డి ఫైర్

ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారాలా.. జగ్గారెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని (EC) అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగానే వ్యవహరించిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన మహిళా నాయకురాలని అన్నారు.

అలాంటి లీడర్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్‌లో తిరస్కరించడం అత్యంత అన్యాయమని అన్నారు. తనకు తెలిసినంత వరకు ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కోర్టుల్లో ఎలాంటి వివాదాలు పెండింగ్‌లో లేవన్నారు. కనీసం ఆమె రాజకీయ జీవితంలో ఎలాంటి నిరసనలు, రాస్తారోకోలు, రాజకీయ గొడవల్లో పాల్గొన్నట్లుగా కూడా రికార్డుల్లో లేదన్నారు.

ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా.. అంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నేతను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీని ముందు పెట్టి రాజకీయం..

మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఎన్నికల సంఘాన్ని వాడుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా చేసిందని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ముందు నిలబెట్టి, ఓ రకంగా తాము అనుకున్న కుట్రలో విజయం సాధించిందని అన్నారు.

ఒక్క సీటు కోసం ఇంతలా దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. విపక్ష నాయకులను టార్గెట్ చేయడానికి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button