HyderabadNotificationPoliticalSPORTSTelangana

హైదరాబాద్‌ సిటీలో స్పెషల్ పోలీస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష లేదు

హైదరాబాద్‌ సిటీలో స్పెషల్ పోలీస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష లేదు

హైదరాబాద్‌ సిటీలో స్పెషల్ పోలీస్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష లేదు

Web desc : హైదరాబాద్ సిటీ పోలీసులు నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన 138 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు.ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ దళాలు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో ఈ కింది అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అలాగే అభ్యర్ధులు తమ ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ వంటి నివాస రుజువులను సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తులను మార్చి 5, 2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవల్సి ఉంటుంది.

అర్హతలు ఏమేం ఉండాలంటే? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జనవరి 31, 2026 నాటికి మాజీ సైనికుల వయస్సు 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అలాగే గత రెండు సంవత్సరాల్లో తమ ఉద్యోగాల్లో సేవను విడిచిపెట్టి ఉండాలి. మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసు సిబ్బందికి 62 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది.

ఎంపిక ఎలా ఉంటుంది? ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, ఉద్యోగానుభవం, స్థానికంత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అధికారులకు నెలకు రూ. 26,000 చొప్పున గౌరవ వేతనం అందుతుంది.

ఈ ఉద్యోగంలో చేరే వారికి వేతనంతో కూడిన సెలవులు ఉండవు. ఏదైనా తప్పనిసరి గైర్హాజరైతే జీతంలో కోత విధిస్తారు. దరఖాస్తుదారులు వారి డిశ్చార్జ్ బుక్, రిటైర్మెంట్ ఆర్డర్, పాన్ కార్డ్, SBI పాస్‌బుక్‌తో సహా ఓరిజినటల్ ప్రతాలు, ఫోటోకాపీలను తీసుకురావాలి.

డ్రైవర్ అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే LMV లేదా HMV లైసెన్స్ కలిగి ఉండాలి. టెక్నికల్ ట్రేడ్‌లు ఉన్నవారు ప్రావీణ్యత ధృవీకరణ పత్రాలను అందించాలి.

వీటితోపాటు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు కూడా అవసరం. ఆసక్తి కలిగిన వ్యక్తులు హైదారబాద్‌లోని పెట్లబుర్జ్‌లో ఉన్న CAR ప్రధాన కార్యాలయంలోని SPOs కార్యాలయంకి స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియకు ఎలాంటి ఫోన్ కాల్స్ అంగీకరించరు. అన్ని అధికారిక సమర్పణలకు అభ్యర్ధులు వ్యక్తిగతంగా హాజరై తప్పనిసరి సంబంధిత ధృవీకరణ పత్రాలను అందించవల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button