HyderabadPoliticalTelanganaVanaparthi

ప్రొఫెసర్ల వేధింపులతోనే వైష్ణవి ఆత్మ*హత్య... సూసైడ్ నోట్ కలకలం..

ప్రొఫెసర్ల వేధింపులతోనే వైష్ణవి ఆత్మ*హత్య... సూసైడ్ నోట్ కలకలం..

ప్రొఫెసర్ల వేధింపులతోనే వైష్ణవి ఆత్మ*హత్య… సూసైడ్ నోట్ కలకలం..

Social media viral : మొయినాబాద్: జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ల వేధింపులతోనే ఏఐడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సీ. వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వనపర్తి పట్టణంలోని పెద్దగూడెం మహారాజుల కాలనీకి చెందిన వైష్ణవి ఈనెల 3వ తేదీన తన స్వగ్రామంలోని నివాసంలో ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కళాశాలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌లు తరగతి గదిలో విద్యార్థినులతో అవమానకరంగా మాట్లాడటమే కాకుండా, బెంచీలపై నిలబెట్టి తోటి విద్యార్థుల ఎదుట అవమానించారని, ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైష్ణవి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రొఫెసర్ల వేధింపులే తన మృతికి కారణమని పేర్కొంటూ సూసైడ్ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై వైష్ణవి తల్లిదండ్రులు వనపర్తిలో గానీ, మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్లో గాని ఫిర్యాదు చేయకపోవడం..

కళాశాల యాజమాన్యం వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌లను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో యాజమాన్యం అర్ధాంతరంగా కళాశాలకు సెలవు ప్రకటించి విద్యార్థులను బస్సుల్లో బయటకు పంపించినట్లు సమాచారం. అనంతరం విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు.

విద్యార్థిని వైష్ణవి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌లను వెంటనే కళాశాల నుంచి తొలగించాలని, వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీ వద్ద కొవ్వొత్తులు వెలిగించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button