
స్పా ముసుగులో వ్యభిచార గృహం.. ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక స్పా సెంటర్‌పై పోలీసులు పంజా విసిరారు.
వెల్నెస్ మరియు స్పా పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో, సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ మరియు స్థానిక పోలీసులు ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు.
దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ‘చాంప్ స్పా సెంటర్’ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఆన్లైన్‌లో కస్టమర్లను బుకింగ్ చేసుకుని స్పా సెంటర్‌లో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
దాడిలో పది మంది యువతులు పట్టుబడగా. దివ్యతో పాటు సంగీత, ప్రకాశ్ అనే ఇద్దరు వ్యభిచార గృహం నిర్వహించేందుకు మద్దతు ఇస్తున్నట్టు గుర్తించి వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కె.వి. సుబ్బారావు తెలిపారు.



