PoliticalTelangana

మహేష్ బాబు నా బావ, ఆయనే నా లవర్, క్రష్.. బర్రెలక్క

మహేష్ బాబు నా బావ, ఆయనే నా లవర్, క్రష్..: బర్రెలక్క షాకింగ్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు లేక బర్రెలు కాస్తున్నా.. ఫ్రెండ్స్ అంటూ వీడియో షేర్ చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాక, ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభించడం గమనార్హం.

కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుపై తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నారు బర్రెలక్క.

ఇంటర్వ్యూలో భాగంగా శిరీషను మీకు లవర్ ఉన్నాడా? అని అడిగారు యాంకర్. దీనికి సమాధానంగా శిరీష మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నా బావ, ఆయనే నా లవర్, నా క్రష్ అంటూ వ్యాఖ్యానించారు.

పోలీసు డ్రెస్సులో మహేశ్ బాబుని చూడటం అంటే తనకు ఇష్టమని తెలిపారు బర్రెలక్క. తాను పోలీసు అవ్వాలని అనుకన్నది కూడా మహేశ్ బాబు పోలీసుగా చేసిన సినిమాలు చూసేనంటూ చెప్పుకొచ్చారు.

ఇక సాయికుమార్ సినిమాలన్నా తనకు ఇష్టమని చెప్పారు. ఆయన చెప్పే డైలాగ్స్ అంటే మరింత ఇష్టమని పేర్కొన్నారు.

అయితే, తాను ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదని చెప్పారు బర్రెలక్క. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి.. తాను అలాంటి వాటి జోలికి పోదల్చుకోలేదని చెప్పారు.

పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి పెద్దగా చదువు.. ఆస్తిపాస్తులు లేకపోయిన ఫర్వా లేదు కానీ.. తనను, తన అమ్మను, వాళ్ల అమ్మను బాగా చూసుకుంటే చాలని అన్నారు.

అలాంటి వ్యక్తినే తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తాజాగా శిరీష చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button