EducationNotificationPoliticalTelangana

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా...

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా...

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల… చెక్ చేసుకోండి ఇలా…

13,343 మంది అర్హత

యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల: 13,343 మంది అర్హత. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి.

యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in లో అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్‌లో మొత్తం 13,343 మంది (సుమారు 2.4 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు.

2025లో 1,087 ఖాళీలకు గాను 14,161 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మే 24, 2026న జరిగిన ఈ పరీక్షకు 8,19,372 మంది రిజిస్టర్ చేసుకోగా, 5.49 లక్షల మంది హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ సర్వీసెస్‌లో 933, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 80 పోస్టులు భర్తీ చేయనున్నారు. తుది ఫలితాల తర్వాతే ప్రిలిమినరీ మార్కులు, కట్-ఆఫ్, ఆన్సర్‌ కీలు విడుదల చేస్తామని కమిషన్ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button