
మరో వివాదంలో తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్…
Web desc : తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చి, తిరిగి చేవెళ్ల కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తాండూర్ ఆఫీస్‌కు రావడం, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి కొన్ని కీలక రికార్డులను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది.
ఆయన ఏ అవసరంతో వచ్చారనే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు పరిశీలించినట్లు సమాచారం అందడంతో కొందరు మీడియా ప్రతినిధులు తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకొని, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇటీవల వివిధ రిజిస్ట్రేషన్చార్జీల పెంపుపై ప్రజల నుంచి, డాక్యుమెంట్ రైటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఈ పెంపు వెనక చేవెళ్ల ఉద్యోగి పాత్ర ఉందా అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేదు. అదే సమయంలో చేవెళ్ల ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి ముఖానికి మాస్కు ధరించి, హడావుడిగా బయటకు పరిగెత్తాడు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు.




