KhammamPoliticalTelangana

వ్యాన్ ఢీకొని ఆర్టీఏ కానిస్టేబుల్ కు గాయాలు..

వ్యాన్ ఢీకొని ఆర్టీఏ కానిస్టేబుల్ కు గాయాలు..

వ్యాన్ ఢీకొని ఆర్టీఏ కానిస్టేబుల్ కు గాయాలు.. ట్రాక్టర్ ను ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తుండగా ఘటన

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తున్న క్రమంలో ఓ వ్యాన్ ఢీకొట్టడంతో ఆర్టీఏ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదం ఖమ్మం ప్రకాశ్ నగర్ లో మంగళవారం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున ప్రకాశ్ నగర్ లో వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఆపారు.

ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ ను సీజ్ చేసి ఆర్టీఏ ఆఫీస్ కు తరలిస్తున్నారు. ఈ సమయంలో ఆర్టీఏ కానిస్టేబుల్ అశోక్ ట్రాక్టర్ పై డ్రైవర్ పక్కన కూర్చున్నారు. ఇదే సమయంలో ఓ కూరగాయల వ్యాన్ వేగంగా వచ్చి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్​పక్కన కూర్చున్న కానిస్టేబుల్ అశోక్​కిందపడిపోగా వ్యాన్ అతడి పైనుంచి వెళ్లింది.

తీవ్రంగా గాయపడ్డ అశోక్ ను ఖమ్మం హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని, డ్రైవర్​పై కేసు నమోదు చేశారు. గాయపడ్డ అశోక్ స్వస్థలం ముదిగొండ మండలం బాణాపురం కాగా ఆయనకు భార్య, బాబు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button