
అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు
పది తులాల బంగారు ఆభరణాలు, కారు, ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం
ముగ్గురు మహిళలు సహా 8 మంది నిందితుల అరెస్ట్
తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, కర్ణాటక రాష్ట్రాలలో దొంగతనాలు.
వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలే టార్గెట్
ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠా
శ్రీరామ నవమి వేడుకల్లోనూ పట్టణంలో మహిళల మెడలోని బంగారు గొలుసుల చోరీ
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
సికె.న్యూస్. ప్రతినిధి.ఆదిలాబాద్
వృద్ధ మహిళలు ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకొని పలు రాష్ట్రాలలో మరియు ఆదిలాబాద్ జిల్లాలో మహిళల మెడలోని బంగారు గొలుసులను చాకచక్యంగా దొంగిలిస్తూ ప్రజలను మోసగిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠాలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిపి మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగతనాలకు ఉపయోగించిన కారు, ఆటో, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బుధవారం ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు.
వివరాలలో మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతానికి చెందిన నిందితులు ఒక ముఠాగా ఏర్పడి మహారాష్ట్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నిందితులు కారు, ఆటోలో ప్రయాణిస్తూ పట్టణాలకు చేరుకొని, ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునేవారు. ఆటోలో మహిళలను ఎక్కించుకొని, మాటలతో నమ్మించి, పక్కనే కూర్చున్న మహిళా నిందితురాలు వాంతులు చేసుకుంటున్నట్లు నటిస్తూ బాధితురాలి దృష్టిని మళ్లించేది.
అదే సమయంలో మరో మహిళ బాధితురాలి మెడలోని బంగారు గొలుసును నోటితో కొరికి తెంపి దొంగిలించేది. అనంతరం బాధితురాలిని దింపేసి అక్కడి నుంచి పరారయ్యేవారు. మహిళలు నకిలీ నంబర్ తో ఉన్న ఆటోలో దొంగతనం చేసి కొద్ది దూరం ప్రయాణించి, కారులో బదిలీ అయి కారులో ఉన్న మగవారితో ఆటోను తోలుతూ వీరు పాల్పడుతున్న మోసం విధానం.
దొంగిలించిన బంగారు ఆభరణాలను కరిగించి ముక్కలుగా చేసి, అవసరమైనప్పుడు కొద్దికొద్దిగా విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు.
వారం రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో ఒక మహిళను ఆటోలో ఎక్కించుకొని ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించి పరారయ్యారు. 2025 శ్రీరామ నవమి సందర్భంగా ఆదిలాబాద్‌లో జరిగిన వేడుకల్లో భోజనాల సమయంలో మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగిలించారు. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన ఉన్న రామాలయంలో భోజనాలు జరుగుతున్న సమయంలో కూడా మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగిలించారు.
తేదీ 31.10.2026న నిర్మల్ పట్టణంలో ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులను దొంగిలించి, వాటిని ముఠాలోని ఇద్దరు సభ్యులకు భద్రపరచడానికి ఇచ్చారు. మరిన్ని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేందుకు ఆదిలాబాద్‌కు వస్తున్న సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు పట్టుకొని విచారించగా, పై నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు.
నిందితులపై ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో ఆరు కేసులు నమోదైనట్లు అదేవిధంగా, మహారాష్ట్ర చత్తీస్గడ్ కర్ణాటక రాష్ట్రాలలో పలు నేరాలలో పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.
నిందితుల వివరాలు:
- విశాల్ సావంత్ పాత్రే (44), వార్ధా, మహారాష్ట్ర.
- అల్లా రహీమ్ (22), వార్ధా, మహారాష్ట్ర.
- సంజయ్ @ ఎల్.బి. సయ్యద్ (38), వార్ధా, మహారాష్ట్ర.
- లొండే విశ్వదీప్ (40), వార్ధా, మహారాష్ట్ర.
- షైక్ ఫెరోజ్ (45), వార్ధా, మహారాష్ట్ర.
- రంజిత పాత్రే (46), వార్ధా, మహారాష్ట్ర.
- లక్ష్మీ అజిత్ బోకర్ (30), వార్ధా, మహారాష్ట్ర.
- నాడే నిషా (25), వార్ధా, మహారాష్ట్ర.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
పది తులాల బంగారం స్వాధీనం
- ఒక బంగారు గొలుసు – 20 గ్రాములు.
- రెండు బంగారు ముక్కలు – ఒక్కొక్కటి సుమారు 10 గ్రాములు.
- రెండు చిన్న బంగారు ముక్కలు – 7 గ్రాములు, 3 గ్రాములు.
- నిర్మల్‌లో దొంగిలించిన రెండు బంగారు గొలుసులు – 25.900 గ్రాములు, 26.500 గ్రాములు.
- దొంగతనాలకు ఉపయోగించిన ఒక డస్టన్ కారు – MH-43-AR-9529.
- ఒక బజాజ్ ఆటో – MH-49-E-2645.
- ఆటోలో అదనంగా ఉంచిన మరో నంబర్ ప్లేట్ – MH-32-B-8261.
- ఐదు సెల్ ఫోన్లు.
మహిళల భద్రతకు భంగం కలిగించే చైన్ స్నాచింగ్‌లపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
ఒంటరి మహిళలు ఉచితంగా లిఫ్ట్ ఇస్తామంటూ ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేసిన వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు, ప్రజల భద్రతకు, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోంది. కేసు చేతనలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై ఎన్ నాగనాథ్, సిబ్బంది రమేష్, రుక్మారెడ్డి, హనుమంతు,నరేష్, జోగేంద్ర సింగ్, అఖిల్, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణ, సైబర్ క్రైమ్ సిబ్బంది త్రిశూల్, అన్వేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




