HyderabadPoliticalTelangana

బీఆర్ఎస్ మహిళా నేత అరెస్ట్…

బీఆర్ఎస్ మహిళా నేత అరెస్ట్…

బీఆర్ఎస్ మహిళా నేత అరెస్ట్…

web desc : బీఆర్ఎస్ మణికొండ మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై వస్తుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాధారణ ప్రజలు, చిన్నచితకా వ్యాపారుల నుంచి ఆమె పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో బుధవారం నార్సింగి సర్కిల్ పరిధిలోని మణికొండ డివిజన్ తిరుమల హిల్స్ లో ఉన్న ఆమె నివాసానికి బాధితులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ బాధితురాలు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో రూపారెడ్డి పై ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం మైలార్ దేవుపల్లి ప్రాంతానికి చెందిన కొందరు బాధితులు నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాము రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదించి రూపా రెడ్డికి ఇస్తే ఆమె ఎగనామం పెట్టారని, ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అయితే రూపా రెడ్డి నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వస్తుండగా అప్పటికే బాధితులు ఆందోళనకు దిగడంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం మాదాపూర్ లో ఉన్న ఓ ప్రైవేటు ఛానల్ లో ఇంటర్వ్యూ కి వెళ్లి తిరిగి వస్తుండగా అక్కడే మాటు వేసిన నార్సింగి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెను అన్ని కోణాల్లో విచారణ చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా, రూపా రెడ్డి తన కూతురును రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ కు ఇచ్చి వివాహం జరిపేందుకు ఇటీవల నిశ్చితార్థం చేశారు. గురువారం మధ్యాహ్నం రూపా రెడ్డి తనకు కాబోయే అల్లుడు సంతోష్ గౌడ్ తో కలిసి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ తన తండ్రిపై పలు సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసులు ఎమన్నారంటే.. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక మోసం కేసులో, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసానికి పాల్పడిన మణికొండ తిరుమల హిల్స్ కు చెందిన పట్లోళ్ల రూపారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో, నిందితురాలు ఇదే తరహాలో పలువురు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది.

ఈ వ్యవహారంలో మరికొంత మంది బాధితులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారి వివరాలను గుర్తించడం, మోసపోయిన మొత్తాలను నిర్ధారించడం, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించడం, నిధుల జాడను గుర్తించడం, సంబంధిత డాక్యుమెంటరీ, డిజిటల్ ఆధారాలను సేకరించడం కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితురాలు పట్లోళ్ల రూపా రెడ్డిని అరెస్ట్ చేసి, పోలీసులు కస్టడీలోకి తీసుకుని రిమాండుకు తరలించినట్లు వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button