
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం.. 17 మంది స్టూడెంట్స్‌కు పాజిటివ్
వెబ్ డెస్క్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU)లో గంజాయి కలకలం రేగింది. ఈగల్ టీం దాడుల్లో 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్‌గా తేలింది.
గంజాయి సేవిస్తు్న్నారన్న విశ్వసనీయ సమాచారంతో హెచ్‌యూసీలో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులుగా డ్రగ్ టెస్టులు చేయగా.. 17 మంది స్టూడెంట్స్ గంజాయి సేవించినట్లు తేలింది.
స్మగ్లర్లు అస్సాం నుంచి గంజాయి తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని ఈగల్ టీమ్ విచారిస్తోంది. నిందితుడు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. నిందితుడి దగ్గర నుంచి 10 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతిష్టాత్మక హెచ్‌సీయూలో గంజాయి పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో వర్శిటీ భద్రతా, తమ పిల్లల భవిష్యత్‌పై స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




