ప్రముఖ సంఘ సేవకులు గాదె మాధవరెడ్డి ఔదార్యం
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 22,
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కాలు విరిగిన లేగ దూడకి గత పది రోజులుగా ప్రముఖ సంఘ సేవకులు లయన్ గాదె మాధవరెడ్డి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి వైద్యం కూడా అందిస్తూ తన మానవత్వాన్ని చాటి చెప్పారు. దూడ తల్లి అయిన గోమాతకి కూడా ఆశ్రయం కల్పించడం గమనార్హం.
గాదె మాధవరెడ్డి గాయపడిన దూడకి వైద్యం అందించడం చాలా అభినందనీయం అని ప్రజలు అన్నారు. గోమాతలను, వాటి సంతతిని మన భద్రాచలం పట్టణంలోని రోడ్లపైన విడిచిపెట్టడం చాలా బాధాకరమని, గాయపడిన మూగజీవులను చూసినప్పుడు తన మనసు కలచివేసిందని మాధవరెడ్డి అన్నారు.
పశువుల యజమానులు తక్షణమే స్పందించి వాటిని వారి వారి ఇళ్లలో పెట్టుకోవాలని, రోడ్ల పై సంచరించే పశువులను సంబందిత అధికారులు వెంటనే గోశాలకి సురక్షితంగా తరలించాలని, పశువులని రోడ్లపై విడిచిపెట్టే వాటి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, భవిష్యత్ లో ఇలా ఎవరు పశువులని రోడ్లపై విడిచిపెట్టకుండా చూడాలని మాధవరెడ్డి డిమాండ్ చేసారు.