*ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి..
అధికారులు అప్రమత్తం కండి..
తూచాంగ్ తుఫాన్ ఉధృతంగా ఉంది..
సికె న్యూస్ ప్రతినిధి సత్తుపల్లి
తూచాంగ్ తుఫాన్ ఉదృతంగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు పంట నష్టం జరగకుండా తగిన ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి కోరారు.
అధికారులు అందుబాటులో ఉండాలని, నియోజవర్గ స్థాయి అధికారులు హెడ్ క్వార్టర్ విడవకుండా క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఆస్తి నష్టం, పంట నష్టం ఏర్పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
నష్టం జరిగిన ప్రాంతంలోని ప్రజలు, రైతులు తన వాట్సప్ నెంబర్ కు ఫోటోలు పంపాలని సూచించారు. తుఫానుకు సంబంధించిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ తో సహా ఆర్ డి ఓ, వ్యవసాయ, ఉద్యానవన వాణిజ్య పంటలు, విద్యుత్, వైద్య శాఖల అధికారులతో మాట్లాడినట్లుగా తెలిపారు.
ప్రజలు అధైర్య పడవద్దని, అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని కోరారు…. ఇట్లు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్…..