EducationKarimnagarPoliticalTelangana

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..

web desc : సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నప్పటికీ.. విద్యాబోధనతో పాటు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాఠశాల ఉపాధ్యాయుడే ఓ విద్యార్థిని వీపుపై వాతలు వచ్చేలా చితకబాదడం తీవ్ర దుమారం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం కరీంనగర్ మండలం ఇరుకుల్ల మైనారిటీ బాయ్స్ గురుకుల క్యాంపస్-2లో ఆరో తరగతి చదువుతున్న డి. సాన్విత్ తనాయ్ అనే విద్యార్థినిని మ్యాథ్స్ టీచర్ పవన్ వీపుపై వాతలు వచ్చేలా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వినాయక చవితి సెలవుల్లో ఇంటికి వెళ్లిన సాన్విత్ తనాయ్ జరిగిన విషయాన్ని తన తల్లి మమతకు వివరించాడు.

దీంతో ఆదివారం సాయంత్రం తల్లి తన కుమారుడితో కలిసి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీని పై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ స్పందిస్తూ విద్యార్థి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన పై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థి పై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button