ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన తుఫాను వాహనం
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం
మృతులలో సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్
డ్రైవర్ కి గాయాలు
సీ కె న్యూస్ వాజేడు మండల ప్రతినిధి :షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం పాయబాట్ల వద్ద ఆగి ఉన్న లారీ ని AP23U 8010 అనే తూఫాన్ వాహనం అతి వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
వాజేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
చత్తీస్గఢ్ నుండి వెంకటాపురం వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టడంతో తుఫాన్ లో ఉన్న సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్.పెరుమాళ్ (50) తో పాటు చత్తీస్గడ్ కి చెందిన సురేష్(15) లు అక్కడికక్కడే మరణించారని.
తూఫాన్ డ్రైవర్ వెంకటేష్ కి గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
సిఆర్పిఎఫ్ క్యాంపు లో విషాదఛాయలు …
మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అకాల మృతి చెందటం తో క్యాంపులో విషాదఛాయలు అలుముకున్నాయి. సెలవు పై ఇంటికి బయలు దేరి అనంత లోకాలకు వెళ్లడం తో వారు జీర్ణించుకోలేకతున్నారు.
అంతసేపు తమతో విధులు నిర్వహించి భార్యకు అనారోగ్యంగా ఉందని స్వరాష్ట్రం పుదుచ్చేరి బయలు దేరిన పెరుమాళ్ చనిపోవటడంతో సిఆర్పిఎఫ్ తో పాటు పేరూరు,వాజేడు పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.