suryapeta
Trending

సూర్యాపేటలో విషాదం.. అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

సూర్యాపేటలో విషాదం.. అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

సూర్యాపేటలో విషాదం.. అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పట్టణానికి చెందిన బండారు బాలకృష్ణ(42) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న అపార్ట్‌మెంట్ సమీపంలో బాలకృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్నారు. మృతికి గల కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బాలకృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button