పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన షురూ...
పలు శుభకార్యాలకు హాజరవుతూ..ముందుకు
సికె న్యూస్ ప్రతినిధి నేలకొండపల్లి : కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గ పర్యటన శనివారం ప్రారంభమైంది.
హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 9:30 గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడ చేరుకున్నారు. ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అక్కడినుంచి సమీపంలోని తమ్మర శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ లో నాచేపల్లి కి చెందిన రాయల రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులు రాయల లావణ్య సాయికృష్ణ లను ఆశీర్వదించారు.
అక్కడి నుంచి పైనంపల్లి గ్రామానికి వెళ్లి గ్రామ పంచాయతీ గుమస్తా దండారపు సైదులు కుమారుడు ఉపేందర్ వివాహం ఇటీవల జరగ్గా..కొత్త జంటను ఆశీర్వదించారు. గువ్వలగుడెం లో వేముల వెంకట నర్సయ్య కుమారుడు ప్రుద్వీకృష్ణ వివాహం సందర్భంగా..ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మి వారి నివాసానికి వెళ్లి ఆశీర్వదించారు.
శ్రీ షిరిడీ, సత్య సాయి మందిర రజత వార్షికోత్సవానికి హాజరు..కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు నేలకొండపల్లిలోని శ్రీ షిరిడీ, శ్రీ సత్య సాయి రజత వార్షికోత్సవ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, ఎం పీ టీ సీ దోసపాటి కల్పన, రేగురి వాసవి, నాయకులు నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు శాఖమూరి రమేష్ ,వెన్నపూసల సీతారాములు, మామిడి వెంకన్న, కొప్పుల హనుమంతరావు, వంగవీటి నాగేశ్వరరావు, బచ్చలికూర నాగరాజు, ఎంపీటీసీలు తేజావత్ కోటేశ్వరరావు బొద్దు బొందయ్య మరికంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.