NizamabadPoliticalTelangana

కేటీఆర్ గడ్డం పెంచితే సీఎం అవుతారా?.. ఎంపీ ధర్మపూరి అర్వింద్ సెటైర్లు

కేటీఆర్ గడ్డం పెంచితే సీఎం అవుతారా?.. ఎంపీ ధర్మపూరి అర్వింద్ సెటైర్లు

కేటీఆర్ గడ్డం పెంచితే సీఎం అవుతారా?.. ఎంపీ ధర్మపూరి అర్వింద్ సెటైర్లు

Web desc : తెలంగాణలో బీజేపీ పార్టీ సైలెంట్ అయిందన్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైలెంట్ కాలేదని.. 2028 ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ సునామీ ఖాయమని అన్నారు. తెలంగాణలో ప్రభంజనం సృష్టించేందుకు బ్యాక్ గ్రౌండ్‍లో పనులంతా జరుగుతున్నాయని.. కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి తెలంగాణలో లేదని వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ కు అంత సులభమేమి కాదన్నారు.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులేకుండా బీజేపీ గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన అర్వింద్.. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు పరస్పరం కాపాడుకుంటున్నాయని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డిపై హైకమాండ్ అసంతృప్తి :

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుకు చర్చకు కొనసాగుతున్నాయని అర్వింద్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల పొత్తుకు రేవంత్ రెడ్డి ఒక్కరే అడ్డుగా ఉన్నారని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తితో లేదన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో రేవంత్ రెడ్డిని ఔట్ చేయవచ్చని చూస్తోందన్నారు.

కాళేశ్వం దోపిడీకి తప్ప ఎందుకూ పనికిరాలేదని బీఆర్ఎస్ దోపిడీ తెలిసి మళ్లీ ప్రజలు ఓటేస్తారా అని అర్వింద్ ప్రశ్నించారు. అధికారంలో ఉండగా లక్షల కోట్లు కాజేసిన బీఆర్ఎస్ తామే గొప్ప అన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటోందని ఆరోపించారు.

త్వరలో తెలంగాణలో మొత్తం పత్రికల, చానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కాషాయమయం కాబోతున్నాయని ఇందులో సంధించే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ కు అంత తేలికేమి కాదని బీఆర్ఎస్‍ను గాయాబ్ చేస్తామన్నారు.

కాంగ్రెస్ ను ఎవరు గాయాబ్ చేయనవసరం లేదని ఆపార్టీనే గాయాబ్ అవుతుందన్నారు. కేటీఆర్ గడ్డంకు రీజన్ ఇదే: గడ్డం పెంచుకుంటే ముఖ్యమంత్రి అవుతావని ఎవరో చెబితే కేటీఆర్ గడ్డం పెంచుకుంటున్నారని సెటైర్ వేశారు. గతంలో కేసీఆర్ పాత సెక్రటేరియట్ కు వెళ్తే గెలవనని చెపితే కొత్త సెక్రటేరియట్ నిర్మించాడని అయినా గెలవలేకపోయాడని అన్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం గడ్డాలు పెంచుకోవడం కేటీఆర్ తొలివ్యక్తి కాదని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గడ్డం పెంచుకున్నారని అయితే ఆయన గడ్డం పెరిగింది తప్పా కాంగ్రెస్ పార్టీ పెరగలేకపోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కూడా గడ్డం పెరుగుతాయి తప్ప ముఖ్యమంత్రి అయ్యేది లేదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button