Uncategorized

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. ఆరుగురు అరెస్ట్, ఆరుగురు పరారీ

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. ఆరుగురు అరెస్ట్, ఆరుగురు పరారీ

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. ఆరుగురు అరెస్ట్, ఆరుగురు పరారీ

Web desc : నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గం ఉప్పునుంతల మండలం వెల్దూరు గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలో దీపావళి పండుగ సందర్భంగా పేకాట ప్రియులు నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఉప్పునుంతల పోలీసులు శనివారం అర్ధరాత్రి మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు చీకటి మాటున పరారయ్యారు.

వెల్దూరు గ్రామ శివారులోని డిండి రిజర్వాయర్ చెక్ డ్యామ్ సమీపంలో కొంతకాలంగా రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బులు పందెంగా పెట్టి అందర్-బాహర్ పేకాట ఆడుతున్నారని ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ కు పక్కా సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని చుట్టుముట్టారు.

పోలీసులను చూసి పేకాట ఆడుతున్న 12 మందిలో ఆరుగురు అక్కడే ఉన్న బైకులను వదిలేసి పొలాల్లోకి పారిపోయారు. మిగిలిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ పేకాట దందాను ఈరట్వానిపల్లి గ్రామానికి చెందిన కాట్రావత్ రాజేష్ నిర్వహిస్తున్నట్లు తేలింది.

ఇతను చుట్టుపక్కల గ్రామాలైన వెల్దూరు, లతీఫ్పూర్, పెద్దమునిగల్ తదితర గ్రామాల నుంచి పేకాట ప్రియులను పిలిపించి ప్రతిరోజు రూ.వేలల్లో పందాలు వేయిస్తూ కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారి వద్ద నుంచి

రూ.60,430 నగదు

6 సెల్ ఫోన్లు

పేకాట ప్లేయింగ్ కార్డులు

4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న ఆరుగురి కోసం గాలింపు చేపట్టామని, పట్టుబడిన వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పుట్ట మహేష్ గౌడ్ తెలిపారు. అక్రమంగా పేకాట, గుట్కా, మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button