KhammamPoliticalTelangana

నా పుట్టినరోజున ఫ్లెక్సీలు, హడావుడి వద్దు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

నా పుట్టినరోజున ఫ్లెక్సీలు, హడావుడి వద్దు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

నా పుట్టినరోజున ఫ్లెక్సీలు, హడావుడి వద్దు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ఖమ్మం : ఈనెల 15వ తేదీన నా పుట్టినరోజు అంటూ చేస్తున్న హడావుడికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు, కీలక సూచనలు ఇచ్చారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నా పుట్టినరోజును పురస్కరించుకొని ఎక్కడ ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. 45 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటివి నాకు ఇష్టం ఉండవని నా మనసును తెలుసుకొని మీరు ప్రవర్తించాలని మంత్రి తుమ్మల తన అభిమానులకు కీలక సూచన చేసారు.

కొందరు నాయకులు నాకు ఫోన్ చేసి ఆటల పోటీలు నిర్వహిస్తామని చెబుతున్నారని.. అలాంటివి నాకు పొరపాటున కూడా ఇష్టం ఉండవని మంత్రి తుమ్మల సీనియర్ నాయకులకు తెలిపారు. నేను గతంలో చాలా సార్లు మీకు బహిరంగంగానే చెప్పానని మళ్లీ మళ్లీ చెబుతున్నాను.. నా మనసును అర్థం చేసుకోండి.. నన్ను అర్థం చేసుకోండి.. జన్మదినమని ఎక్కడా హడావుడి చేయవద్దు.

ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయంలో తన బర్త్ డే సందర్భంగా కేక్ కటింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని మంత్రి తుమ్మల గారు తెలిపారు. నా రాజకీయ జీవితాన్ని మీరు క్షుణంగా పరిశీలించండి. ఎలాంటి ఫ్లెక్సీలు కానీ, కేక్ కటింగ్ లు చేసిన నేను సహించేది లేదని మంత్రి తుమ్మల గారు తేల్చి చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button