Mahabub badPoliticalTelangana

సర్పంచ్ V/S టిఏ.. ఎంపీడీవో ఆఫీస్‌లో రచ్చరచ్చ! 'నువ్వొక్కడివే సర్పంచ్‌వా?’ ‘నువ్వసలు బ్రోకర్‌వా’?

సర్పంచ్ V/S టిఏ.. ఎంపీడీవో ఆఫీస్‌లో రచ్చరచ్చ! 'నువ్వొక్కడివే సర్పంచ్‌వా?’ ‘నువ్వసలు బ్రోకర్‌వా’?

సర్పంచ్ V/S టిఏ.. ఎంపీడీవో ఆఫీస్‌లో రచ్చరచ్చ! ‘నువ్వొక్కడివే సర్పంచ్‌వా?’ ‘నువ్వసలు బ్రోకర్‌వా’?

Web desc : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పరిషత్ కార్యాలయం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. ప్రజా సమస్యలపై జవాబుదారీగా ఉండాల్సిన అధికార యంత్రాంగం, ప్రజల తరఫున నిలబడాల్సిన ప్రజాప్రతినిధుల మధ్య హద్దులు దాటిన వాగ్వాదం తీవ్ర దుమారం రేపింది.

ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఫాంపాండ్ (రైతు కుంట) బిల్లుల వ్యవహారం కాస్తా తిట్ల పురాణానికి దారితీయడంతో కార్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది.

*‘నువ్వొక్కడివేనా?’ వర్సెస్ ‘నువ్వు బ్రోకర్‌వి!’*

పోగుళ్లపల్లి గ్రామంలో పూర్తి చేసిన ఫాంపాండ్ పనులకు సంబంధించి దాదాపు రూ. లక్షకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న కూలీలకు ఈ డబ్బులే జీవనాధారం కావడంతో, బిల్లుల విడుదలపై నిలదీసేందుకు సర్పంచ్ వీరన్న గ్రామస్తులతో కలిసి మండల కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) ను బిల్లుల జాప్యంపై ప్రశ్నించారు.

రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకోవడమేంటని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేయగా, టెక్నికల్ అసిస్టెంట్ ఏమాత్రం తగ్గకుండా *“మండలంలో నువ్వు ఒక్కడివే సర్పంచువా?”* అంటూ నిర్లక్ష్యంగా ఎదురుదాడికి దిగారు. బాధ్యతాయుతమైన అధికారి ప్రజాప్రతినిధిని చులకన చేస్తూ మాట్లాడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సర్పంచ్ వీరన్న….

*“ప్రజల సొమ్ముతో బతుకుతూ పనులు చేయని నువ్వు అసలు అధికారికా లేక బ్రోకర్‌వా?”* అంటూ సర్పంచ్ వీరన్న విరుచుకుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట స్థాయికి చేరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button