— ప్రభుత్వ భూమి అంగుళం కబ్జా చేసిన ఊపేక్షించేది లేదు.
— ప్రజల అభివృద్ధి,సంక్షేమం కోసం అధికారులు పని చెయ్యాలి.
— గత ప్రభుత్వం లో మాదిరి తప్పుడు కేసులు పెట్టవద్దు.
— ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ పనులు జరగవు.
— నియోజక వర్గ స్థాయి అధికారులతో
సమీక్ష సమావేశం.
— సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్ విజయకుమార్, మువ్వ విజయబాబు.
సి కె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు లోని నారాయణ పురం గ్రామంలో గురువారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద నియోజక వర్గ స్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ , మువ్వ విజయబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశంలో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ నియోజక వర్గం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే దృష్టి లో ఉంచాలి అని ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ పనులు జరగకూడదు అని
గత ప్రభుత్వం లో మాదిరి తప్పుడు కేసులు పెడితే ఉపేక్షించేది లేదని
నియోజక వర్గంలో ప్రధాన సమస్య త్రాగు నీటి సమస్య ను వెంటనే పరిష్కరించాలి అని మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో అధికారుల నిర్లక్ష్యం పై అసహనం వ్యక్తం చేసినరు.
ఎవరైనా ప్రభుత్వ భూమి అంగుళం కబ్జా చేసిన ఊపేక్షించేది లేదు అని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే రైతుల పట్ల రెవెన్యూ అధికారులు ఓపిక గా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి అని సింగరేణి డి ఎమ్ ఎఫ్ టి నిధులతో సత్తుపల్లి నియోజక వర్గ అభివృద్ధి కి అధికారులు కృషి చెయ్యాలి అని
ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఊపేక్షించేది లేదు అని ప్రజల అభివృద్ధి,సంక్షేమం కోసం అధికారులు పని చెయ్యాలి లేదని గత ప్రభుత్వం నాయకులకు వత్తాసు గా పని చెయ్యాలి అనుకుంటే మాత్రం నిర్మొహమాటంగా వేరే చోటుకు వెళ్లిపోవచ్చు అని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కు తెలియకుండా ఏ పని చెయ్యడానికి వీలు లేదు వచ్చే నెల 04 వ తేదీన సత్తుపల్లి లో జిల్లా కలెక్టర్,జిల్లా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో పోడు భూముల వివాదాల సమస్య పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని సమావేశంలో అధికారులకు, ప్రజలకు తెలియజేసినారు.