పిల్లలను విక్రయిస్తూ పట్టుబడ్డ ముఠా..
ఖమ్మం పాత బస్టాండ్లో మంగళవారం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు చిన్న పాపని తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన విషయం బట్టబయలైంది.
ఓ నలుగురు వ్యక్తులు పాత బస్టాండ్లో చిన్నారితో తిరుగుతుండగా ఓ మహిళ వారిని పాపను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించింది.
ఈ విషయం బట్ట బయలు అవుతుంది అనే భయం తో సదరు వ్యక్తులు మహిళపై దాడి చేసి పారిపోతుండగా గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఈ విషయం గమనించిన అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్లు కిరణ్, లక్ష్మయ్యలు సహాయంతో వీడియో జర్నలిస్టు బాచిమంచి రమేష్ పట్టుకున్నారు. పాపను ఎత్తుకొచ్చిన నలుగురు వ్యక్తులను వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.