తల్లి పంచిన రక్తంతో పుట్టిన ఆలోచనే ఈ రక్త శిబిరం శభాష్ సాధనపల్లి
“పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటుచేసిన ఎస్.ఎం.ఆర్ మోటార్స్”
సాధనపల్లి కిరణ్ ఆధ్వర్యంలో” చేయూత స్వచ్ఛంద సేవ పరివేక్షణలో రక్తదాన కార్యక్రమం జయప్రదం”
“ముఖ్య అతిథులుగా, వెంకటాపురం ఎస్సై.అశోక్ & యూత్ డైనమిక్ లీడర్ మీ సేవ చిడెం.రవి”
“ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఎస్.ఎం.ఆర్ మోటార్స్ యాజమాన్య జన్మదిన వేడుకలలో భాగంగా. ములుగు జిల్లాలోని వెంకటాపురం మరియు ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి అన్వేషించిన యువకుడే’ సాధనపల్లి కిరణ్, తల్లి పంచిన రక్తంతో పుట్టిన ఆలోచనే ఈ రక్త శిబిరం, అన్నట్టుగా వెంకటాపురం ఎస్.ఎం.ఆర్ మోటార్స్ స్థాపకులు వారి జన్మదిన సందర్భంగా వారి షాప్ లో , చేయూత స్వచ్ఛంద సేవ సమస్త సిబ్బందితో మాట్లాడి తన సొంత ఎస్.ఎం.ఆర్ మోటార్స్ సర్వీసింగ్ షాప్ లో తన జన్మదిన వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాధనపల్లి కిరణ్ కుటుంబ సభ్యులతో సహా, తన క్లాస్మేట్స్ అయినా పదవ తరగతి విద్యార్థులు.
పలు సేవా కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్న సభ్యులు పాల్గొని 25 నుంచి 28 దాకా రక్తదాన డోనర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సబ్ ఇన్స్పెక్టర్ అశోక్, మీ సేవ చిడెం, రవి,చేయూత స్వచ్ఛంద సేవ సభ్యులు చిడెం, సాయి ప్రకాష్, మాజీ సర్పంచ్ చిడెం.ఫ్యామిలీ తదితరులు పాల్గొన్నారు.