డాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి అంటు హాస్పిటల్ ముందు మృతదేహం తో మృతుడి బంధువుల నిరసన..
సుమారు మూడు గంటల పాటు ఖమ్మంలోని గణేష్ చెస్ట్ హాస్పిటల్లో మృతదేహంతో బంధువుల ఆందోళన..
డెడ్ బాడీనీ లోపలికి తీసుకురావడంతో భయబ్రాంతులకు గురైన ఇతర పేషంట్లు…
డిశ్చార్జ్ అనంతరం పేషంట్ కి ఆర్ఎంపి చికిత్సతో సదరు పేషంట్ మృతి.. అంటూ.. తమ తప్పేమీ లేదంటున్న గణేష్ చెస్ట్ హాస్పిటల్ వైద్యులు..
మృతుడి బంధువుల ఆవేదనతో కూడిన ఆవేశంతో ఆసుపత్రి పరిసరాలు ధ్వంసం..
మృతుడి బంధువులు రాష్ గా…బిహేవ్ చేస్తూ తమపై దాడికి. యత్నిoచారంటూ సదరు వైద్యుల ఆరోపణ..
గణేష్ చెస్ట్ హాస్పిటల్ వైద్యుడి సూచనల మేరకే ఆర్ఎంపీతో చికిత్స చేయించామని. పేషంట్ మృతికి గణేష్ చెస్ట్ వైద్యులే కారణమంటూ బంధువుల ఆరోపణ…
మృతదేహాన్ని హాస్పిటల్ లోపల ఉంచి ధర్నా చేయాలని యోచనతో ఒక దశలో పోలీసులతో మృతుడి బంధువుల వాగ్వివాదం..
మానవీయకోనంతో బాధితులను గంటకు పైగా సముదాయించేందుకు యత్నించిన పోలీసులు..
ఆస్పత్రి ఎదుట భారీగా ట్రాఫిక్ జామ్..
ఆస్పత్రిలో మెడికల్ షాపు గ్లాసు, ఇతర పరికరాలు ద్వంసం..
ఖమ్మం టూ టౌన్ లో ఇరువురు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు…
పోలీసు ఉన్నతాధికారుల రాకతో సద్దుమణిగిన ఆందోళన..
ఖమ్మం జిల్లా కేంద్రంలోని గణేష్ చెస్ట్ వైద్యశాలలో దగ్గు ఆయాసంతో ఇటీవల ఆసుపత్రిలో కంటేపుడి నరసింహ రావు పేషంట్ ను చేర్పించారు… కాగా ఆరోగ్య పరిస్తితి మెరుగుపడటంతో ఆ పేషంట్ ను డిశ్చార్జ్ చేయగా.. పేషంట్ నివాసం వద్ద ఆర్.ఎం.పి వైద్యుడి చికిత్సతో సదరు పేషంట్ కంటేపురి నరసింహ రావు (45) ఆరోగ్యం మరింత క్షిణించడం తో ఆసుపత్రి సిబ్బంది సలహా మేరకు ఖమ్మంలో ని ప్రయివేట్ హాస్పిటల్ కు తీసుకువెల్లగా సదరు డాక్టర్ పేషంట్ ముందే తుది శ్వాస విడిచారు అని చెప్పడంతో ఆమృతదేహంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని గణేష్ చెస్ట్ హాస్పిటల్ ఎదుట మధ్యాహ్నం మృతుడి బంధువులు సుమారు గంటన్నర పాటు ఆందోళన నిర్వహించారు..
తమ వ్యక్తి ఖమ్మం జిల్లా కేంద్రంలోని గణేష్ హాస్పిటల్ డాక్టర్ ఓవర్ డోస్ ఇంజక్షన్ల వల్లనే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్ వాహనం నుంచి ఆసుపత్రిలోనికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు.. పోలీసులు మృతదేహాన్ని లోపలి తీసుకెళ్లడానికి నిరాకరిస్తూ కాసేపు అడ్డుకున్నారు..
కాగా మృతదేహాన్ని ఆసుపత్రి లోపల డాక్టర్ రూమ్ వద్ద ఉంచి ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్న మృతుడి తాలూకు బంధువులు పోలీసుల వద్ద నుంచి అంబులెన్స్ లో డోర్ ను ఓపెన్ చేసి గట్టిగా కేకలు అరుపులతో.. ఆసుపత్రి లోపలకు డాక్టర్ రూమ్ వద్ద మృతదేహాన్ని ఉంచి ధర్నా కు దిగారు
దానితో భయభ్రాంతులకు గురైన మిగతా ఓ పి పేషంట్లు రోడ్డు పైకి పరుగులు తీశారు మృతదేహానికి లోపలికి తీసుకు వెళ్లే తరుణంలో మెడికల్ షాపు క్యాబిన్ అద్దాలను ధ్వంసం చేస్తూ.. గట్టికేకలతో మృతదేహాన్ని లోపల తీసుకెళ్లి డాక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..
ఈ క్రమంలో పోలీసులు ఎంత సముదాయించినా.. వారించినా.. సదరు మృతుడి తాలూకు బంధువులు వినలేని స్థితి నెలకొంది.. సుమారు గంటన్నర పైగా మృతదేహాన్ని ఆసుపత్రి లోపల డాక్టర్ క్యాబిన్ రూమ్ వద్ద నిలుపగా అక్కడ చికిత్స కోసం వచ్చిన ఇతర రోగులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు..
కాగామృతుడి తాలూకు బంధువులు తమకు న్యాయం జరగాలని న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించేదిలేదని, భీష్మించు కూర్చున్నారు కొంతమంది వైద్యులు లోపలికి వస్తున్నా కూడా వారిపై కూడా దాడి చేసేందుకు మృతుడి తాలూకు బంధువులు యత్నించారు
ఈ ఆందోళనను టూ టౌన్ కు చెందిన ముగ్గురు ఎస్సైలు ఎంతో అప్రమత్తంగా ఉంటూ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.. మృతుడి బంధువులు వినేస్థితిలో లేక పోలీసు ఉన్నతాధికారులైన టూ టౌన్ సిఐ మరియు రఘునాధపాలెం సిఐలు ఆసుపత్రి ముందు మృతదేహం ఉంచడం సరైన పద్ధతి కాదని మీకు ఏ మైన అన్యాయం జరిగితే పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ,మీరు ఫిర్యాదు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఎట్టకేలకు ఆసుపత్రి లోపల ఆందోళన కోసం ఉంచిన మృతదేహానికి జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి మృతుడు తాలూకు బంధువులను అక్కడనుంచి తరలించారు..
మీరు పోలిస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు చేయాలని.. ఈవిధంగా రూల్స్ బ్రేక్ చేస్తే మీరే నష్టపోతారని బాధితులకు సిఐలు ఇద్దరు నచ్చజెప్పి వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.. అనంతరం భయభ్రాంతులకు గురైన సదరు వైద్యులు ఆసుపత్రి లోపల గల పరికరాలు, మెడికల్ షాప్ క్యాబిన్ అద్దాలు ధ్వంసం ఇతర నష్టాలను అక్కడ జరిగిన వైద్యులపై దాడికి యత్నం చేసారని వారిపై చర్యలు తీసుకోవాలని డాక్టరు మరికొంతమంది వైద్యులతో కలిసి ఐఎంఏ సహకారంతో ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మృతుడి బంధువుల పై ఫిర్యాదు చేసిన్నటు సమాచారం అనంతరం మృతుడి బంధువులు కూడా తమ వ్యక్తి చావుకు కారణమైన సదరు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసిన్నటు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది